
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్‌లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ధోనీ లేకపోవడంతో జట్టు ఘోరంగా ఓటమికి గురైంది. కానీ, ధోనీ కెప్టెన్సీపై చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు మరో విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
‘ధోనీ జట్టులో కెప్టెన్‌గా ఉండడం.. లేకపోవడం పెద్ద విషయం కాదు. ఒక బ్యాట్స్‌మన్‌గా అతను జట్టుకెంతో అవసరం. ఈ విషయం హైదరాబాద్, ముంబై మ్యాచ్‌లలో 2సార్లు రుజువైంది. ధోనీ క్రీజులోకి వచ్చాడంటే అవతలి జట్టుపై తీవ్రమైన ఒత్తడి తీసుకొస్తాడు. రెండు సీజన్లుగా బ్యాట్స్‌మన్‌గా.. మెంటార్‌గా బాగా రాణిస్తున్నాడు. వచ్చే ఏడాది నాలోనూ అంతమార్పును చూస్తారు. ధోనీ అంతటి వాడిని కావాలంటే నాకు చాలా సత్తా కావాలి. కానీ, తాను కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నంత సేపు కెప్టెన్‌గా కొనసాగుతాడు’ అని రైనా చెప్పాడు.

దీన్ని బట్టే తెలుస్తోంది వచ్చే ఏడాది నుంచి రైనాకు కెప్టెన్సీ రాబోతుందని.. సూపర్ కింగ్స్ జట్టును సొంతజట్టులా భావిస్తున్న ధోనీ లేకపోవడం జట్టుకు తీరని లోటు అన్నమాట వాస్తవం. బుధవారం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 80పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మే5న ఆడనుంది.